calender_icon.png 27 December, 2024 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్‌గా ఉంటేనే 2028 ఒలింపిక్స్ ఆడుతా

09-11-2024 01:13:17 AM

న్యూఢిల్లీ: ఫిట్‌నెస్ ఉండి గాయాల బారీన పడకపోతే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ఆడేందుకు తాను సిద్ధమని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అభిప్రాయపడింది. ఈలోగా మరిన్ని బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ‘ పతకం లేకుండానే పారిస్ ఒలింపిక్స్ నుంచి వెనుదిరగడంపై అంతగా ఆలోచించడం లేదు.

ఎందుకంటే ఇక్కడితోనే నా కెరీర్ అయిపోలేదు. ఓడిపోయాన నే బాధ ఉన్నప్పటికీ అదే మనసులో పెట్టుకోలేను. ఇప్పుడు నాకు 33 ఏళ్లు. ఫిట్‌గా ఉంటే.. ఎలాంటి గాయాలు లేకపోతే కచ్చితంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ ఆడుతా.

దానికి ముందు నేను సాధించాల్సిన టైటిల్స్ కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం నా దృష్టి మొత్తం రానున్న జపాన్, చైనా ఓపెన్ టోర్నీలపై పెట్టాను’ అని సింధూ పేర్కొంది. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధూ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది.