calender_icon.png 5 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపద్బాంధవుడికి పౌర సన్మానం

04-02-2025 10:35:03 PM

జన్మాంతం  ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా..

డాక్టర్ లయన్ నీలి ప్రకాష్..

చర్ల (విజయక్రాంతి): మీకోసం మేమున్నాం టీమ్ చర్ల చైర్మన్ జాతీయ ఉత్తమ సేవా నంది అవార్డు గ్రహీత, సేవాధర్పణ, సేవరత్న, సహాయ సేవాక్ అవార్డ్ గ్రహీత, గుడ్ సమారిటన్ థియోలాజికల్ సెమీనరీ ఇంక్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన లయన్ నీలి ప్రకాష్ సేవలను గుర్తిస్తూ చర్ల మండలంలో పౌర సన్మానం నిర్వహించి, వారు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేస్తూ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జయభారతి హాస్పటల్ అధినేత గూడూరు సుదర్శన్ రావు దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూడూరు సుదర్శన్ రావు మాట్లాడుతూ... నీలి ప్రకాష్ ఒక ప్రత్యేకత ఉంది. అసాధారణమైన శక్తి యుక్తులు కలిగిన వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అటువంటి వారిలో కొందరు మాత్రమే ఎదుటివారి కష్టాలను తమ కష్టాలుగా భావించి ముందుకు సాగుతారు.

ఆ కోవకు చెందిన వారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన నీలి ప్రకాష్ మేమున్నాం మీకోసం అంటూ సమాజంలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయలు ఆపదలో ఉన్నవారికి అందజేసిన ఘనత మండలంలో ఎవరైనా ఉన్నారంటే అది నీలీ ప్రకాష్ కె చెందుతుందనీ అన్నారు. డాక్టర్ జయభారతి మాట్లాడుతూ... చర్ల మండలం అంటే ఏజెన్సీ ప్రాంతం ఈ ప్రాంతంలో అధిక శాతం గిరిజనులు వారి వారి పనుల నిత్యం చర్ల మండలానికి వచ్చి వెళ్తుంటారు. అలాంటి వారికి ఆదివారం సంతకు వచ్చే గిరిజనులకు ఆహార అందించి వారి కడప నింపి దాతల సహాయంతో అన్నదానం చేస్తూ 150 వారాలు గిరిజనులకు ఒక పూట అన్నం పెట్టిన ఘనత నీలీ ప్రకాష్ కే చెందుతుందని అన్నారు.

చర్ల మండలంలో వరదల సమయంలో వేద ముంపుకు గురైన నిరాశ్రయులకు కూడు గుడ్డ ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ఘనత నీలి ప్రకాష్ కే దక్కుతుంది. ఇలా ఒకటి కాదు మీకోసం మేమున్నామంటూ తన స్నేహితుల ద్వారా ఒక సంస్థను స్థాపించి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఘనత నిలిప్రకాస్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధనికొండ శ్రీనివాస్, డాక్టర్ గూడూరు సుదర్శన్  రావు, డాక్టర్ గూడూరు జయభారతి, పరుచూరి రవి, దొడ్డి తాత రావు, మచ్చ రామారావు, బాబ్జీ, ఎస్.కె షాజహాన్, నీలి సాంబయ్య, నాగబాబు, చీమలమర్రి మురళి, నీలి నందు, తడికల లాలయ్య తదితరులు పాల్గొన్నారు.