బీజింగ్, నవంబర్ 23: చైనాకు చెంది న ఓ ఉద్యోగి విధుల్లో ఉండి కునుకు తీయడంతో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఆ ఉద్యో గి కంపెనీపై దావా వేసి రూ.4 కోట్ల పరిహారం దక్కించుకున్నాడు. జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జాంగ్ తైక్సింగ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రెండు దశాబ్దాలు గా పనిచేస్తున్నాడు. జనవరిలో జాంగ్ అర్ధరాత్రి వరకు పనిచేసి తన డెస్క్‌పై సుమారు గంటపాటు నిద్రించాడు.
దీంతో యాజమాన్యం ‘జీరో టోలరెన్స్’ చర్యల్లో భాగంగా జాంగ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. విచారణలో న్యా యమూర్తి స్పందిస్తూ ‘జాంగ్ ఒకే ఒకసారి విధుల్లో నిద్రించాడు. అది అతడి మొదటితప్పుగా పరిగణించి, విడిచిపెట్టాల్సింది. కానీ, విధుల నుంచి తొలగిం చడం నిబంధనలకు విరుద్ధం’ అని స్ప ష్టం చేశారు. జాంగ్‌కు కంపెనీ 350, 000 యువాన్ల (రూ.4 కోట్లు) పరిహా రం అందించాలని ఆదేశించారు.