27-04-2025 12:11:49 AM
వివరాలు వెల్లడించిన డీసీపీ సీహెచ్ శ్రీనివాస్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 26: ఓ వ్యక్తి నమ్మకంగా ఉండి ఇంటిగుట్టును అంతా తెలుసుకున్నాడు. మరో ఐదుగురితో కలిసి కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం కేసు వివరాలను రాజేంద్రనగర్ డిసిపి సిహెచ్ శ్రీనివాస్ మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 21వ తేదీ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పిఎన్టి కాలనీలో షాకీర్ అలీ దంపతుల ఇంట్లోకి ఉదయం 9 గంటల 22 నిమిషాలకు నలుగురు వ్యక్తులు ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు.
వారిని కత్తులతో బెదిరించి బీరువా తలుపులు ధ్వంసం బంగారు వెండి నగలతో పాటు నగదును అపహరించుకుపోయారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీఎస్ బృందం సమన్వయంతో విచారణ జరిపారు. టెక్నికల్ ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు. ఏ వన్ నిందితుడు జిబ్రాన్ బిన్ జబ్బార్ డ్రైవర్ మైలార్దేవ్పల్లిలో ఉంటాడు. ఇతడు బాధిత దంపతులకు దగ్గర బంధువు. ఈ నేపథ్యంలో వారి ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు ఇతడికి తెలుసు. ఇతడు మొహమ్మద్ అకీల్, మొహమ్మద్ ఫసియుద్దీన్, సోహైల్ షా ఖాన్, మొహమ్మద్ అబ్దుల్ రబ్ జావీద్, మొహమ్మద్ షబ్బీర్ తో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు.
షిఫ్ట్ కార్ లో షాకిర్ అలీ ఇంటికి చేరుకొని వీరిలో నలుగురు ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి సొత్తు అపహరించినట్లు డీసీపీ వెల్లడించారు. పోలీసులు బంగారం వెండి నగలను, పూరికి ఉపయోగించిన స్విఫ్ట్ కారుతో పాటు రెండు కత్తులను రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. ప్రజలు తమకు తెలిసిన వారితో మీ ఇంటి విషయాలు నగదు నగల విషయం చెప్పవద్దని సూచించారు. క్షేమంగా లాకర్లలో దాచుకోవాలని అన్నారు అదేవిధంగా సిసి కెమెరాలు ఉపయోగించాలని సూచించారు.