17-02-2025 08:58:02 PM
తన భార్యను తనకు అప్పగించండి...
భర్త ఆవేదన..
కొత్తగూడెం (విజయక్రాంతి): కోర్టు వద్దకు వచ్చిన తన భార్యతో ఆమె బంధువులు మాట్లాడతానని చెప్పి బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చండ్రకొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన లాడెన్ ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన సంధ్య, తానూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, తప్పుడు కేసులు పెట్టడంతో నెల రోజుల నుండి తన భార్యను సఖీ సెంటర్ లో ఉంచారని, ఇద్దరి ప్రూఫ్స్ చెక్ చేసి ఆమెను పంపుతామన్నారూ ఇదే విషయమై సోమవారం కొత్తగూడెం కోర్టుకు వచ్చిన తన భార్యను ఆమె బంధువులు మాట్లాడుతామని చెప్పి పక్కకు తీసుకెళ్లిన బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారని తెలిపాడు. తన భార్య సంధ్య గర్భవతి అని ఆమెను వారి బంధువులు ఎం చేస్తారో అనీ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు కల్పించుకొని తన భార్యను తనకు అప్పగించాలని కోరుతూ పోలీస్ లకు ఫిర్యాదు చేశామన్నారు.