పుట్టినరోజు వేడుకల్లో స్నేహితుడిపై బీరు బాటిల్తో దాడి హత్య
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు?
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): యువకుడిని బర్త్ డే పార్టీకి పిలిచిన స్నేహితులు దారుణంగా కొట్టి చంపారు. బీరు బాటిల్ తో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. అల్కపూరి కాలనీలో ఐడిపిఎల్ కు చెందిన రోహిత్ అనే యువకుడిని అతడి స్నేహితుడు కొట్టి చంపేశాడు. స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి ఐడిపిల్ నుండి అల్కాపూర్ కాలనీకి వచ్చిన రోహిత్ తో పాటు మిగతా వారు మద్యం సేవించారు. అనంతరం రోహిత్ తలపై అక్బర్ బీర్ బాటిల్ తో మోదాడు. దీంతో రోహిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అయితే రోహిత్ ను బర్త్ డే పార్టికి పిలిపించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్బర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న నార్సింగీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.