calender_icon.png 27 September, 2024 | 3:12 AM

సీఎం కావాలని ఉంది

26-09-2024 01:59:41 AM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: గత ఐదేళ్లలో మహారాష్ట్రలో జరిగిన పొలిటిక ల్ ట్విస్టులు దేశంలోని ఏ రాష్ట్రంలో నూ జరగలేదంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దగ్డూషేఠ్ హల్దాయ్ గణపతి ఆలయంలో పూజల అనంతరం డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ మాట్లాడుతూ.. తనకు కూడా సీఎం కావాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఒక్కరూ తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని, అయితే వారు మెజార్టీ సీట్లు దక్కించుకోవాలన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేరవ ని, ప్రతి ఒక్కరూ వారు కోరుకున్నది పొందలేరని తెలిపారు. అదంతా ఓట ర్ల చేతిలో ఉంటుందని పవార్ పేర్కొన్నారు.  కాగా త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌సీపీ, శివసేన కూటమి..

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో పోటీచేయనుందని అజిత్‌పవార్ వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం మూడు పార్టీలు కలిసి చర్చించుకొని కొత్త సీఎంను ఎన్నుకుంటామని తెలిపారు. అయితే కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు తమ నాయకుడే సీఎం కావాలి అంటే.. కాదు తమ నాయకుడే సీఎం కావాలి అంటూ పరస్పరం బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండటం మహా ఎన్నికల వేళ హాట్‌టాపిక్‌గా మారింది.