calender_icon.png 21 October, 2024 | 12:09 PM

హీరోగా, విలన్‌గా చేయాలని ఉండేది

24-07-2024 12:00:00 AM

“ఈ సినిమా చేయాలన్న ఆలోచన కోవిడ్ టైమ్‌లో వచ్చింది. ‘పలాస’ తర్వాత మా సుధాస్ మీడియాలో ఎలాంటి సినిమా చేయాలన్న చర్చ మొదలైనప్పుడు నేటితరం యువతకు చేరువయ్యేలా ఒక సినిమా చేయాలనుకున్నాం” అంటూ తాను కథానాయకుడిగా నటించిన ‘ఆపరేషన్ రావణ్’ సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు రక్షిత్ శెట్టి. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 26న తెరమీదికి రానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో సమావేశమైన రక్షిత్ “తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుం దో తెలియదు. మా నాన్న డైరెక్షన్‌లో నటించడం సంతోషంగా ఉంది. నాన్నగారికి సినిమాల మీద ఉన్న ప్యాషన్ నాకు తెలుసు.

‘పలాస’ సినిమా చేస్తున్నపుడు కూడా ఆయన కథా చర్చల్లో పాల్గొనేవారు. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ దొరికింది. స్క్రిప్ట్ అనుకున్న విధంగా వచ్చాకే సెట్స్ మీదకు వెళ్లాం. అంతలో ‘నరకాసుర, శశివదనే సినిమాలు పూర్తి చేశాను. “ఆపరేషన్ రావణ్‌” సినిమాలో సందేశం ఏమీ ఉండదు. సినిమాలోని సైకో పాత్ర చిన్నప్పటి నుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా మారతాడు. తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్‌లోకి వెళ్తారు. ఇందులో నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. హీరోగా, విలన్‌గా డ్యూయల్ రోల్ చేయాలని నాకు ఉండేది. అది ఈ సినిమాతో తీరిందా.. లేదా? అనేది తెరమీదే చూడాలి.