calender_icon.png 20 April, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన ముందే దుస్తులు మార్చుకోమనేవాడు

17-04-2025 12:00:00 AM

సినీరంగంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి బహిరంగంగా మాట్లాడేందుకు ధైర్యం చేసే నటీమణులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి ఘటనల గురించి మౌనంగా భరించేవారే ఎక్కువ. అయితే, తాజాగా మలయాళీ ఇండస్ట్రీకి చెందిన నటి విన్సీ సోనీ అలోషియస్ తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి పంచుకున్నారు. ఇప్పుటికే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విన్సీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఒక సినిమ సెట్స్‌లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చిన విన్సీ.. ఆ పేరును వెల్లడించలేదు. ‘సినిమా షూటింగ్ సమయంలో హీరో డ్రగ్స్ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు నేను ఎంతో ఇబ్బందిపడ్డా. తన ముందే దుస్తులు మార్చుకోవాలంటూ నన్ను ఇబ్బందిపెట్టేవాడు. అతను అలాంటి మాటలు అందరి ముందే మాట్లాతుడుతుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించేది.

నా జీవితంలో అది ఒక అసహ్యకర సంఘటన. ఆ ఘటన తర్వాత ఇక నేను డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నా. నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నాకు భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు.. కానీ ఈ విషయాన్ని బహిర్గతం చేయాలన్నదే నా కోరిక. నాతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికీ తెలుసు. కానీ, ఎవరూ స్పందించలేదు’ అని చెప్పుకొచ్చారు హీరోయిన్ విన్సీ అలోషియస్.