calender_icon.png 17 November, 2024 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చొక్కా విప్పి విసిరేశాడు

17-11-2024 12:21:50 AM

కొన్ని సినిమాలను, పాటలను ప్రేక్షకులు మరచిపోవడం చాలా కష్టం. అవి జనాల హృదయాల్లో అంతగా ముద్ర వేస్తాయి. అలాంటి పాటే ‘ఏక్ దో తీన్’ సాంగ్. 1983లో విడుదలైన ‘తేజాబ్’ చిత్రంలోనిదీ గీతం. నాటి విశేషాలను మాధురి దీక్షిత్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ‘భూల్ భూలయ్యా 3’ ప్రమోషన్స్‌లో భాగంగా మాధురి దీక్షిత్ మాట్లాడుతూ.. “షూట్ రోజులను నేను మరచిపోలేను. దీనికోసం భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు.

అయితే డ్యాన్స్‌తో నాకు పెద్దగా పరిచయం లేకపోవడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ దగ్గర శిక్షణ తీసుకున్నా. దాదాపు రోజంతా శిక్షణలోనే గడపటంతో బాగా అలసిపోయాను. ఉదయాన్నే దర్శకుడిని కలిసి ఓపిక లేదని షూట్‌లో పాల్గొనలేనని.. ఒకవేళ పాల్గొనాలంటే క్లోజప్ షాట్స్ తీసుకోవద్దని చెప్పా. నా కండీషన్‌కు అంగీకరించిన ఆయన లాంగ్ షాట్స్ వరకూ మాత్రమే ఆరోజు చిత్రీకరించారు.

పాటలో కనిపించేవారి విషయానికి వస్తే.. వారంతా మేము షూటింగ్ చేస్తున్న పరిసర ప్రాంత వాసులు. షూట్ చూడాలనుకునే వారిని హాల్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. పాట ప్లే చేయగానే వారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక వ్యక్తి అయితే తన చొక్కా విప్పి స్టేజ్ పైకి విసిరేశాడు. అప్పుడే అనుకున్నాం.. ఆ పాట మంచి హిట్ అవుతుందని. కానీ అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు” అని మాధురీ దీక్షిత్ తెలిపారు.