మల్లికా షెరావత్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని బాలీవుడ్ నటీమణి. బోల్డ్ అంట్ హాట్ సీన్లలో నటించే ఈ భామ హిందీతోపాటు కొన్ని దక్షిణాది సినిమాల్లోనూ నటించింది. ప్రత్యేక గీతాలతోనూ యువతను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ‘మర్డర్’ సినిమాలో ఆరబోసిన హాట్‌నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ‘హాట్ దివా’గా క్రేజ్ సొంతం చేసుకుంది.
2012లో హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమైన మల్లిక.. అడపాదడపా హిందీ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విడుదలకు ముందు నిర్వహించిన ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ సందర్భంగా మల్లికా షెరావత్ దక్షిణాది దర్శకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
“ఓ సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్.. ఓ హాట్ ఐటెం సాంగ్‌లో నటించాలని కోరాడు. ఆ పాటతో నా హాట్‌నెస్ ప్రేక్షకులకు మరింత చేరువవుతుందని చెప్పాడు. నేను సరేనని చెప్పి, పాటలో నా హాట్‌నెస్‌ను ఎలా చూపిస్తారని అడిగా. దీనికి ఆ డైరెక్టర్ ‘నీ నడుము మీద చపాతీలు వేడి చేస్తా’ అన్నాడు! అంతే ఇక ‘ఈ సాంగ్ చేయను’ అని చెప్పేశా” అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది.