calender_icon.png 29 December, 2024 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురిని ప్రేమపెండ్లి చేసుకున్నాడని

29-12-2024 02:09:49 AM

* అల్లుడిపై బీర్ బాటిల్‌తో మామ దాడి 

* తలపగిలి ఆస్పత్రిలో చేరిన బాధితుడు

ఖమ్మం, డిసెంబర్ 28 (విజయక్రాంతి): కూతురిని ప్రేమించి,పెండ్లి చేసుకున్నాడనే కక్షతో అల్లుడిపై మామ బీరు బాటిల్‌తో దాడి చేసి, గాయపరిచిన ఘటన శనివారం ఖమ్మంలో జరిగింది. ఖమ్మంలోని సీతాతండాకు చెందిన గుగులోత్ అశోక్, నేలకొండ పల్లి మండలం అజయ్‌తండాకు చెందిన మానస ప్రేమించుకున్నారు.

గత నెలలో ప్రేమ వివాహం చేసుకుని, వేరు కాపురం పెట్టారు. వీరు దగ్గర బంధువులే అయినా తనకు ఇష్టం లేని పెండ్లి చేసుకోవడం నచ్చని మానస తండ్రి వెంకటేశ్వర్లు, అల్లుడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మానసకు కడుపులో నొప్పి వస్తుండటంతో శనివారం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చి చూపించగా, మానసకు కడుపులో కణితి ఉందని, ఆపరేషన్ చేసి తీసివేయాలని వైద్యులు చెప్పడంతో అశోక్ విషయాన్ని మానస తల్లిదండ్రులకు చెప్పాడు.

మానస తండ్రి వెంకటేశ్వర్లు ఆస్పత్రికి వచ్చి అక్కడే ఉన్న అల్లుడు అశోక్‌పై బీరు బాటిల్‌తో దాడి చేశాడు. దీంతో తల పగిలి, విపరీతంగా రక్తం కారింది. గాయాలపాలైన అశోక్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు.