19-04-2025 12:00:00 AM
నందమూరి కల్యాణ్‌రామ్ తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తొలిరోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొంటూ చిత్రబృందం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ.. ‘క్ల్లుమాక్స్ అద్భుతమైన సీక్వెన్స్.
పొద్దున్నే మా అబ్బాయి సిని మా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదని చెప్పాడు. ఆ రియాక్షన్‌కు నేను షాక్‌కు గురయ్యా. చాలా గర్వంగా ఉంది నాన్న అని చెప్పాడు’ అన్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు శ్రీకాంత్, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, నిర్మాత సునీల్ బలుసు తదితరులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.