calender_icon.png 19 January, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ స్కూల్లో ప్రపోజ్ చేశాడు!

31-08-2024 12:51:31 AM

తన కాబోయే భర్త, నటుడు సిద్ధార్థ్.. తన ప్రేమను వ్యక్తపరిచిన తీరు నాకెంతో నచ్చిందని చెప్పింది అదితి రావ్ హైదరి. తాము ఎంగేజ్‌మెంట్ వేడుక చేసుకున్న చోటే మ్యారేజ్ కూడా జరుగుతుందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది కాబోయే పెళ్లికూతురు. ‘మా నానమ్మ అంటే నాకెంతో ఇష్టం. అన్ని విషయాలూ ఆమెతో షేర్ చేసుకునేదాన్ని. హైదరాబాద్‌లో ఆమె ఒక స్కూల్ ప్రారంభించారు. అది నాకెంతో ప్రత్యేకం. నా చిన్ననాటి రోజులు అక్కడే ఎక్కువగా గడిపా. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు.

ఓ రోజు నా వద్దకు వచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకెళ్లాలని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చొని.. అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేశానని చెప్పాడు’ అని వివరించింది. ఇంకా తన పెళ్లి ఎక్కడ జరగబోతోందో కూడా అదితి ఈ సందర్భంగా చెప్పింది. ‘వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. మా నిశ్చితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక మేమిద్దరం అనౌన్స్ చేస్తాం’ అని తెలిపింది.