వ్యాపారిని మోసగించిన సైబర్ నేరగాళ్లు
ముంబై, డిసెంబర్ 25: అమాయకులను దోచుకునేందకు సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త విధానాలను అవలంబిస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి చెందిన సిమ్‌ను సైబర్ నేరగా ళ్లు స్వాప్ చేసి రూ.7.5 కోట్లు కొట్టేశారు. అధికారులు తెలిపిన ప్రకారం ముంబై కందివాలీ కి చెందిన ఓ వ్యాపారవేత్త ఖాతా రూ. కోట్లు దండుకుందామని స్కామర్లు ప్లాన్ వేశారు. అందుకోసం అతడి సిమ్ స్వాప్ చేశారు. నె ట్‌వర్క్ ప్రొవైబర్‌ను ట్రాక్ చేసి, టార్గెట్ చేసి న వ్యక్తి మొబైల్ నంబర్‌ను తమ వద్ద ఉన్న సిమ్ కార్డుకు లింక్ చేశారు.
తద్వారా బ్యాంక్ నుంచి అతడి అకౌంట్‌కు వచ్చే ఓటీపీలను తెలుసుకున్నారు. తర్వాత అతడి అకౌంట్ నుంచి డబ్బును ఖాళీ చేశారు. తన ఖాతా నుంచి కోట్లలో విత్‌డ్రా అవుతుండటాన్ని గు ర్తించిన యజమాని సైబర్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి, విషయాన్ని వివరించాడు. వెం టనే స్పందించిన అధికారులు ఆ బ్యాంక్ నో డల్ అధికారులను సంప్రదించారు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీస్ టీమ్ రూ. 4.65 కోట్లను ఫ్రీజ్ చేసి, నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. మిగిలిన మొత్తం అప్పటికే స్కామర్ల చేతుల్లోకి వెళ్లింది. వారు ఆ సొమ్మును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి, విత్‌డ్రా చేసుకున్నారని వెల్లడించారు.