calender_icon.png 24 January, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖోఖో ఆడుతూనే ప్రాణాలు వదిలాడు

24-01-2025 12:42:26 AM

భీంపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో విషాదం

ఆదిలాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి): తోటి విద్యార్థులతో కలిసి ఆనందంగా ఆటలు ఆడుతూనే ఓ విద్యార్థి ప్రాణం వదిలిన విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాథోడ్ బన్నీ ..

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో గురువారం నిరహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్నాడు. ఖోఖో క్రీడా పోటీల్లో పాల్గొన్న రాథోడ్ బన్నీ ఆ ఆట అడుతూనే ఆకస్మికంగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా బన్నీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.