సూర్యాపేట, అక్టోబర్ 27: కీడు వచ్చిదంటూ సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డువాసులు ఆదివారం సాయంత్రం వార్డును విడిచి వెళ్లారు. తెలిసిన వివరాల ప్రకారం.. ప్రతి మంగళవారానికి ఒకరు చొప్పున వార్డుకు చెందిన ఆరుగురు మృతిచెందారు. దీంతో ఆ వార్డు ప్రజలు వార్డుకు కీడు వచ్చిందని నమ్మి ఆదివారం పిల్లాపాపలతో కలిసి బయటకు వెళ్లిపోయారు. వారంతా పట్టణం వెలుపలకు వెళ్లి ఓ ఖాళీ స్థలంలో వంట చేసుకుని అక్కడే ఉన్నారు. వీరు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని, 2015లో సైతం ఇలాగే జరిగిందని వార్డువాసులు తెలిపారు.