calender_icon.png 16 November, 2024 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తింగరితనంతో నవ్విస్తా

21-08-2024 01:22:25 AM

రావు రమేశ్, ఇంద్రజ జంటగా నటించిన సినిమా ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న  సినిమా ఈ నెల 23న (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రంలో రావు రమేశ్ కుమారుడిగా నటించిన అంకిత్ కొయ్య సరసన రమ్య పసుపులేటి జత కట్టింది. రమ్య మీడియాతో పంచుకున్న ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. “నాకు నాలుగైదేళ్ల వయసు ఉన్నప్పట్నుంచి యాడ్స్ చేస్తున్నాను. అనుష్క ‘పంచాక్షరీ’లో బాలనటిగా చేశా. సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘స్పైడర్’లోనూ ఓ రోల్ చేశా.

తర్వాత చదువు కోసం సినిమాలకు విరామం ఇచ్చా. బ్యాచిలర్స్ ఫినిష్ చేసి సినిమాల్లోకి వచ్చాను. ప్రజలకు రీచ్ అయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగపడింది. ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ దర్శకుడు లక్ష్మణ్ కార్య నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి, ఆడిషన్స్‌కు పిలిపించారు. ఈ చిత్రంలో నేను గ్లామర్, ట్రెడిషనల్.. రెండు విధాలుగా కనిపిస్తా. నేను ఎమోషన్స్ బాగా చేస్తా. కామెడీ చేయడమంటే ఇంకా ఇష్టం. ప్రేక్షకుల్ని నవ్వించగలిగితే క్యారెక్టర్ పండినట్టే కదా! నా క్యారెక్టర్ పేరు ‘బబ్లీ’. తను క్యూట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయి. ఆమెకు కొంచెం తింగరితనం ఉంటుంది. ఆ పాత్ర ద్వారా నవ్వించే అవకాశం వచ్చింది” అని వివరించింది.