calender_icon.png 31 October, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లికి నిరాకరించిందని యువతిని హతమార్చాడు

30-08-2024 02:06:34 AM

  1. గచ్చిబౌలిలోఉన్మాది ఘాతుకం 
  2. మృతురాలు పశ్చిమ బెంగాల్ వాసి

శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన ఓ యువతి ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం రాత్రి గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ (25)  కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చింది. గోపన్‌పల్లి తండా సమీపంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్నది.  కొంతకాలం క్రితం ఆమెకు సెలూన్‌లో పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన రాకేష్‌తో పరి చయం ఏర్పడింది.

రాకేష్ కొంతకాలం నుం చి దీపనను వేధిస్తున్నాడు. ఆమె పెళ్లికి నిరాకరిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో రాకేష్ బుధవారం రాత్రి దీపన ఉంటున్న ఇంటికి వెళ్లాడు. మరోసారి పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అందుకు ఆమె మళ్లీ నిరాకరించింది. దీంతో కోపం తో రగిలిపోయిన రాకేష్ అక్కడే ఉన్న కూరగాయల కత్తితో యువతిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డు వచ్చిన స్నేహితుల పైనా దాడి చేశాడు.

ఘటనలో తీవ్ర గాయాలతో దీపన అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితులకు గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి రాకేష్ మొయినాబాద్‌కు వెళ్లాడు. ఆత్మహత్య చేసుకునేందుకు కరెంట్ స్తంభం ఎక్కేందుకు యత్నించి విద్యుత్ షాక్ గురయ్యాడు. ఘటనలో తీవ్ర గాయాలపాల య్యాడు. పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని ఓ ఆ ఆసుపత్రికి తరలిం చారు.  హత్య, దాడి విషయమై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.