calender_icon.png 11 January, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరవొద్దన్నందుకు చంపేశాడు

03-12-2024 03:00:23 AM

నేరేడ్‌మెట్ పీఎస్ పరిధిలో ఘటన

కాప్రా, డిసెంబర్ 2: నెమ్మదిగా మాట్లాడమని అన్నందుకు ఓ వ్యకిని దారుణంగా కొట్టిచంపిన ఘటన నేరేడ్‌మేట్ పీఎస్ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ఓల్డ్ నేరడ్‌మెట్ వినాయక్‌నగర్‌లో నివాసముండే బండారి రాము(36) స్థానికంగా సెట్రింగ్ పనులు చేస్తుంటాడు.

కాగా సోమవారం సాయంత్రం రాము తన ఇంటి సమీపంలోని పాన్ డబ్బాకు వచ్చి పాన్‌మసాల కొనుగోలు చేస్తుండగా అటుగా వచ్చిన శ్రీకాంత్ పాన్‌డబ్బా వద్ద పాన్‌మసాల కావాల్సిందిగా గట్టిగా అరిచాడు. గట్టిగా ఎందుకు అరుస్తున్నావ్ అని బండారి రాము అనడంతో కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ .. రాముపై పిడిగుద్దులు గుద్దాడు. ఇష్టం వచ్చినట్లు దాడిచేయడంతో బండారి రాము అక్కడే కుప్పకూలిపోయాడు.

అనంతరం శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా బండారి రాము మృతిచెంది ఉన్నాడు. శ్రీకాంత్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.