పుణె, జూలై 30: ఆన్‌లైన్ గేమ్‌కు అడిక్ట్ అయిన ఓ పదోతరగతి బాలుడు అకస్మాత్తుగా అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోన్ డిప్యూటీ కమిషనర్ స్వప్న గోరె తెలిపిన వివరాలు.. పుణె శివారులోని పింప్రి చించ్‌వాడ్ సిటీలో నివాసముండే బాలుడి తండ్రి వృత్తి రీత్యా నైజీరియాలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. బాలుడు స్థానికంగా ఓ బడిలో 10వ తరగతి చదువుతున్నాడు. అతడి గదిలో దొరికిన ఓ నోట్‌బుక్‌లో.. లాగ్ అవుట్, ఎక్స్‌డీ అని రాసి ఉంది. అలాగే గదిలో మూడు చార్ట్‌లను గుర్తించగా.. అందులోని ఒక మ్యాప్‌లో సూసైడ్ ఎలా చేసుకోవాలి అని ప్రాక్టీస్ చేయబడిన చిత్రాలు ఉన్నాయి అని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.