calender_icon.png 20 April, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నమయ్య సంకీర్త నలకు పర్యాయపదం

16-03-2025 12:00:00 AM

తిరుమల కొండపై వాయు తరంగాలగుండా భక్తుల శ్రవణేంద్రియాలను చేరే ఆ స్వరం వేల హృదయాలను తన్మయత్వం లో ముంచెత్తుతుంది. మనసు నిండా కలియుగ దైవం వేంకటేశ్వరుణ్ణి నిలిపి భక్తిర సంతో పునీతులను చేస్తుంది. సంకీర్తన య జ్ఞ ప్రక్రియకు ఆద్యుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో సంకీర్తన యజ్ఞాలను నిర్వహించిన సోమయాజి ఆ మధుర గాయకులు. వందలాది అన్నమ య్య సంకీర్తనలకు స్వరరూపం కల్పించి, అన్నమయ్యకు పునర్జన్మ అందించిన సృష్టికర్త ఆయన. గాత్రంతోపాటు మృదంగ వాయిద్యంలోనూ ప్రతిభ చూపిన సృజనశీలి ఆయన. ఆంజనేయ కృతి మాలతో పాటు వివిధ కృతుల కర్త కూడా. ఆయనే ఇటీవల కన్నుమూసిన ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.

రాజమహేంద్రవర వాస్తవ్యులు గరిమె ళ్ళ బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబరు 9న సంగీత సాహిత్య కుటుంబంలో కృష్ణవేణి దంపతులకు జన్మిం చారు. ప్రసాద్ తండ్రి నరసింహారావు కూ డా వాగ్గేయకారులే. సుమారు 100 వరకు కీర్తనలను స్వయంగా రచించారు ఆయన. వాటికి మ్యూజికల్ నొటేషన్‌తోసహా 1974 ప్రాంతంలో ప్రచురణ రూపం కల్పించారు. మాతామహులు శిష్టా  ్ల శ్రీరామమూర్తి హనుమత్ ఉపాసకులు, గాయ కులు. ఎనిమిది భాషల్లో ఉద్దండ పండితు లు. సంస్కృతం, ప్రాకృతం, పాళీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషలలో ఆయనకు పాండిత్యం ఉండేది.

శ్రీరామమూర్తికి కృష్ణవేణి, వరలక్ష్మి, రాధ, జానకి, సరోజ, శారద అనే ఆరుగురు కుమార్తెలు. వీరందరికీ తండ్రినుంచి గానకళ వారసత్వంగా అ బ్బింది. వాళ్లలో నాలుగో వారైన జానకి సుప్రసిద్ధ నేపథ్య గాయని. బాలకృష్ణ ప్ర సాద్ మాతృమూర్తి కృష్ణవేణి పంచకావ్యా లు అభ్యసించారు. గాత్ర సంగీతంతోపా టు వయొలిన్ నేర్చుకున్నారు. బాలకృష్ణ ప్రసాద్ పితామహులు సైతం గాయకులే. ఆయన భజనలను చక్కగా పాడేవారు. ఈ విధంగా పితామహ, మాతామహ కుటుంబాల నుంచి బాలకృష్ణ ప్రసాద్‌కు ఆధ్యా త్మిక, కళా సంపద వారసత్వంగా సంక్రమించింది. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్- రాధ దంపతులకు జి.యస్. పవనకు మా ర్, జి.వి.యన్. అనిల్ కుమార్ అనే ఇద్దరు పిల్లలున్నారు.

పసిప్రాయంలోనే పాటలు

ఇలాంటి వాతావరణంలో జన్మించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పుట్టిన ఆరేడు నెలలకు మాటలను పలకడంతోపాటు ఏడాదికే పాటలనూ పాడేవారట. తనకు గుర్తున్నంత వరకు తన రెండో ఏటనుంచి పాడినట్టు ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారాయన. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యుడిగా అన్నమాచార్య సంకీర్తనల్లో ప్రత్యేకతను సాధిం చారు. ‘ఆకాశవాణి’లో ఏపూ గాయకుడిగా గుర్తింపు పొందారు. 1978లో తిరు మల తిరుపతి దేవస్థానంలో అన్నమాచా ర్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరారు. 2006లో ఉద్యోగ విరమణ చేశారు. మూ డు దశాబ్దాలపాటు సాగిన ఉద్యోగ జీవితంలో ఆయన సంగీత నైపుణ్యాన్ని ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగించుకుంది. ఆయనలోని ప్రతిభను ప్రపంచా నికి చూపింది. అంకితభావంతో ఆ ప్రాజెక్టులో వివిధ స్థాయిల్లో బాలకృష్ణ ప్రసాద్ కృషి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం, అహోబిల మఠాల్లో ఆస్థాన సంగీత విద్వాంసుడిగా వ్యవహరించారు బాలకృష్ణ ప్రసాద్. తిరుమల తిరుపతి దేవస్థానం కోసం వివిధ ఆడియో రికార్డింగులలో, స్వరకల్పనతో కూడిన గ్రంథ ప్రచురణలలోనూ భాగస్వామి అయ్యారు. అన్నమాచార్య కృతుల కు ప్రాచుర్యం కల్పించేందుకు తరగతుల నిర్వహణ కూడా చేపట్టారు.

గొప్ప కీర్తనలకు అద్భుత స్వరాలు

‘వినరో భాగ్యము విష్ణుకథ..’, ‘జగడపు జనవుల జాజర..’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు..’ వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చిన ప్రతిభాశాలి గరిమెళ్ల. ఆయన స్వరపరిచిన అన్నమ య్య సంకీర్తనలు సంగీత సాహిత్య సమర్థ మేళవింపుతో మదిమదిలో భక్తిభావాన్ని నింపుతాయి. ఒకదాని కొకటి భిన్నమైన స్వరప్రయోగాలు వారి కూర్పులో కనబడతాయి. సాహిత్యంలో సరిగ్గా ఒదిగిపోయే లా స్వరాలు సమకూర్చగలగడం విశేషం. సుందరరంజని, వాణీప్రియ, చిత్ర కల్యాణి వంటి ఇరవైకి పైగా రాగాలను ఆయన గళం సృజించింది. సంప్రదాయ కర్ణాటక, లలిత, జానపద సంగీతాలలో ఆయన పా టలు పాడారు. 

పాటలోని ప్రతి మాటను, రాగంలోని ప్రతి సంగతినీ స్పష్టంగా, స్వచ్ఛంగా పలికించగల గంధర్వగానం వారిది. సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఆద్యులు బాలకృష్ణ ప్ర సాద్. ఒక గాయకుడు ఒక రోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హై దరాబాదు, కాకినాడ వంటి నగరాల్లో ఈ సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించారు. వీటిలో వందలాది పాట లు ఆయన స్వయంగా పాడడం విశేషం. సామవేదం షణ్ముఖశర్మ సృజించిన 150 కిపైగా శివపద కీర్తనలకు బాలకృష్ణ ప్రసా ద్ స్వర రూపం కల్పించి, ఆలపించారు. దేశవ్యాప్తంగా వివిధ చోట్ల ఎన్నో ‘అన్నమ య్య నాదయజ్ఞాలు’ విజయవంతంగా ని ర్వహించారు. వివిధ దేశాల్లో గొప్పనైన ప్రదర్శనలు ఇచ్చారు. మృదుమధుర స్వ రంతో కూడిన ఆయన ప్రదర్శనలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక టీవీ ఛానె ల్లో ‘హరి సంకీర్తనం’ కార్యక్రమం ద్వారా వం దలాది అన్నమాచార్య సంకీర్తనలను ప్రేక్షకులకు బాలకృష్ణ ప్రసాద్ నేర్పారు. ఎందరో సంగీత ప్రియులు ఈ కార్యక్ర మం ద్వారా ఆయన నుంచి నేరుగా నేర్చుకోగలిగారు. సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో 2008 మే 10న సిలికానాంధ్ర సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం, తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన లక్ష గళార్చన కార్యక్రమం వారి నేతృత్వంలోనే జరి గింది. ఇందులో లక్షమందికి పైగా గాయకులు పాల్గొన్నారు. 

సంగీత సాహిత్యాలకు పెద్ద లోటు

హనుమంతునిపై ‘ఆంజనేయ కృతిమణిమాల’ పేరుతో 21 కృతులతోపాటు వి నాయకునిపై 50 కృతులు రచించారు ప్ర సాద్. నవగ్రహాలపై, ఇతర దేవతలపైనా వివిధ కృతులకు కర్త ఆయన. తాను స్వ యంగా రూపొందించిన కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని సంగీత స్వరాలతోసహా ప్రచురించారు. గరిమెళ్ల వారి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు, గౌరవాలు లభించాయి. ‘అన్నమయ్య సంకీర్తన మహతి’, ‘అన్నమయ్య నాదజ్యోతి’ వంటి బిరుదాలను అసంఖ్యాకంగా పొందారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారా న్ని 2020లో ఆయన పొందారు. అన్నమయ్య సంకీర్తనలకు పర్యాయపదంగా నిలిచే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అస్తమ యం తెలుగు సంగీత, సాహిత్య ప్ర పంచానికి తీరని లోటు. అన్నమయ్య సంకీర్తనలు తెలుగునాట వినిపించినంత కాలం ఆయ న చిరంజీవిగా ఉంటారు. 

వ్యాసకర్త: డా.రాయారావు సూర్యప్రకాశ్‌రావు , సెల్: 9441046839