calender_icon.png 1 March, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రజలకు ఆయన రాజాసాబ్

28-02-2025 12:00:00 AM

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా రూపొందుతున్న చిత్రం ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి కావొచ్చింది.

ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్‌ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది. సల్మాన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు రష్మిక, సత్యరాజ్ పాత్రలతో ఈ టీజర్‌ను కట్ చేశారు. ఈ సినిమాలో సాయిశ్రీగా రష్మిక నటిస్తుండగా.. సంజయ్ రాజ్‌కోట్ పాత్రలో సల్మాన్ నటిస్తున్నాడు. సత్యరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ‘నాన్నమ్మ అతడికి సికందర్ అని పేరు పెట్టింది. తాతేమో సంజయ్ అని పెట్టాడు.

ప్రజలు ఆయన్ను రాజాసాబ్ అని పిలుస్తారు’ అంటూ టీజర్ ప్రారంభమైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. సల్మాన్, మురుగదాస్‌లకు కొంతకాలంగా మంచి హిట్ అనేది పడింది లేదు. దీంతో వీరిద్దరూ ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. టీజర్ చూస్తుంటే హిట్ పడేలానే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.