01-04-2025 02:40:22 AM
ఐఏఎస్ కృష్ణభాస్కర్‌ను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ తనకు స్ఫూర్తి అని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో కృష్ణభాస్కర్ నీటి కొరతను అధిగ మించేందుకు అనేక చర్యలు చేపట్టారు. నీటి లభ్యతను విస్తృతంగా పెంచడం కోసం రిజర్వాయర్ల సమీపం లో చిన్న ట్యాంకులను ఏర్పాటుచేశారు.
పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలతో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. ఆయన చర్యలతో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర పెంచగలిగారు.
ఆయనకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్ లో బెటర్ ఇండియా ప్రచురించింది. ఆ పోస్ట్‌నే తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ ప్రశంసలు కురిపించారు. అందుకే ఆయన ‘నా మండే మోటివేషన్’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.