calender_icon.png 8 January, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయనొక అయస్కాంతం

30-12-2024 03:35:57 AM

బాలీవుడ్ కథానాయిక వామికా గబ్బి.. సల్మాన్ ఖాన్‌ను అయస్కాంతంతో పోల్చింది.  వరుణ్ ధావన్, కీర్తి సురేశ్‌తో పాటు ఈ ముద్దుగుమ్మ నటించిన ‘బేబీ జాన్’ చిత్రం తాజాగా విడుదలైంది. సల్మాన్ సైతం అతిథి పాత్రలో మెరిశారు. ప్రేక్షకులందరి దృష్టిని ఈ పాత్ర విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే సల్మాన్‌తో కలిసి పని చేయడం గురించి వామిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

“సల్మాన్ అయస్కాంతం వంటి వ్యక్తి. ఆయన దగ్గర తెలియని ఓ మ్యాజిక్ ఉంది. ఆయనతో ఎవరు పని చేసినా ఇట్టే ఆకర్షితులవుతారు. ‘బేబీ జాన్’లో సల్మాన్‌తో కలిసి నటించడం ఒక కలలా అనిపించింది. ఆయనతో పని చేయాలన్న నా కల నెరవేరింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే ఇంత గొప్ప అవకాశం రావడం అదృష్టం” అని చెప్పింది. ప్రస్తుతం వామిక తమిళ చిత్రం ‘జీవి’లో నటిస్తోంది.