calender_icon.png 19 October, 2024 | 10:17 PM

పనిచేస్తున్న కంపెనీనే హ్యాక్ చేశాడు

19-10-2024 01:17:53 AM

ఉత్తర కొరియా సైబర్ నేరగాడి నిర్వాకం

ఐడెంటిటీ మార్చుకొని జాబ్‌లో చేరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉత్తరకొరియాకు చెందిన సైబర్ నేరగాడు ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరి.. ఏకంగా తాను పనిచేస్తున్న కంపెనీకే ఎసరుపెట్టాడు. తన ఐడెంటిటీని మార్చుకొని కంపెనీలో రిమోట్ ఐటీ వర్కర్‌గా ఉద్యోగంలో చేరి డాటా ను హ్యాక్ చేసేందుకు యత్నించాడు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉత్తరకొరియాకు చెందిన సైబర్ నేరస్థుడు తనకు కంపెనీ ఇచ్చిన యాక్సెస్‌ను వాడుకొని సంస్థ డాటా ను హ్యాక్ చేశాడు. పూర్తి నెట్‌వర్క్‌ను సైతం హ్యాక్ చేయడానికి ప్రయత్నించగా.. అతడు విధులకు రెగ్యులర్‌గా హాజరుకాకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల సాధ్యపడలేదు. మేనేజ్‌మెంట్ అతడి మెయిల్ ను చెక్ చేయడంతో ఈ విషయం బయటకు పొక్కింది.

కంపెనీ డాటాను తిరిగి ఇవ్వడానికి అతడు తిరస్కరించాడని, డబ్బులు చెల్లించాలంటూ బెది రింపులకు పాల్పడ్డాడని యాజమా న్యం సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్యూర్‌వర్క్స్‌కు వెల్లడించింది. కాగా కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అధికమయ్యాయని, కంపె నీ యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరిస్తున్నారు.