03-04-2025 12:00:00 AM
దర్శకుడు డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ ‘ఫణి’. ఈ థ్రిల్లర్ ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్‌రోల్‌లో నటిస్తోంది. మహేశ్‌శ్రీరామ్ కీలక పాత్ర పోషిస్తు న్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ఈవెంట్‌లో టాలీవుడ్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. “ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు.అలా ‘ఫణి’ సినిమాను గ్లోబల్ మూవీ గా రూపొందిస్తు న్నారు వీఎన్ ఆదిత్య” అన్నారు. డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘దీన్ని చిన్న చిత్రంగా మొదలుపెట్టాం.
ఆ తర్వాత కేథరీన్ ఒప్పుకోవడంతో మరో స్థాయికి వెళ్లింది’ అని తెలిపారు. కేథరీన్ మాట్లాడుతూ.. ‘పాములంటే నాకు భయం. ‘ఫణి’ సినిమా కోసం ఆదిత్య నన్ను సంప్రదించినప్పుడు పాముతో నేను చేయాల్సిన సన్నివేశాలన్నీ సీజీలో చేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన సరే అన్నారు. కానీ, చివరలో పాము కాంబినేషన్‌లో నాతో సీన్స్ చేయించారు. ఈ తరహా సిని మా నేను ఇప్పటిదాకా చేయలేదు” అని చెప్పారు.
హీరో మహేశ్ శ్రీరామ్ మాట్లాడు తూ - ‘మా స్వస్థలం హైదరాబాద్. ఈ సినిమాతో సొంత ఇంటికి వచ్చినట్లుంది” అని చెప్పారు. చిత్ర నిర్మాత, సంగీత దర్శకురాలు మీనాక్షి మాట్లాడుతూ.. ‘ఇందులో కేథరీన్ నటనకు నేషనల్ అవార్డ్ వస్తుంది. మా అన్నయ్య పామును కూడా ఆడిషన్ చేసే తీసుకున్నాడు’ అన్నారు. చిత్ర సమర్పకుడు పద్మ నాభరెడ్డి, సహ నిర్మాత శాస్త్రి, రైటర్ పద్మ, నటుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.