calender_icon.png 26 December, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్‌లో ఉండలేనని యాసిడ్ తాగాడు..

26-12-2024 01:54:58 AM

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): హాస్టల్‌లో ఉండ లేనని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మణికంఠ అనే విద్యార్థి ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. సెలవులు వచ్చినా కుటుంబీకులు ఇంటికి తీసుకుపోవడానికి రాకపోవడంతో మనస్థాపా నికి గురై బుధవారం యాసిడ్ తాగాడు. గమనించిన హాస్టల్ వార్డెన్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు.