calender_icon.png 28 November, 2024 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యానికి వెళ్తే ప్రాణం పోయింది

29-10-2024 03:06:40 AM

డాక్టర్ నిర్లక్ష్యంతోనే మరణించాడని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణ

చేగుంట, అక్టోబర్ 28: వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చేగుంటలో చోటుచేసుకుంది. మృతుడి  బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. చేగుంట మండలంలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన చందా యాదగిరి (60) మూత్రం సరిగా రావడం లేదని చేగుంటలోని డాక్టర్ జ్ఞానేశ్వర్ ఆసుపత్రి వెళ్లాడు.

డాక్టర్ పరిశీలించి ఆపరేషన్ చేయాలని సూచించాడు. సోమవారం ఆపరేషన్‌కు తీసుకెళ్లగా అతనికి బీపీ పెరగింది. మెరుగైన చికిత్స కోసం మెదక్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపో యాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే యాదగిరి చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు చేగుంట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పారు. కాగా, ఆసుపత్రి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించడానికి ఒప్పు కొన్నట్లు తెలిసింది.