బాలీవుడ్‌కు చెందిన ఐదుగురు స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వచ్చినా తాను తిరస్కరించానని గర్వంగా చెప్తోంది కంగనా రనౌత్. అందుకు కారణాలనూ వెల్లడించిందామె. కంగనా ఇటీవల ఓ పోడ్కాస్ట్లో పాల్గొని తమ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకుంది. “షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్‌కుమార్, రణబీర్ కపూర్లతో సినిమాలు చేయని కొంద రు నటీమణులు బాలీవుడ్లో ఉన్నారనడానికి నేనే ఉదాహరణ. ఇండస్ట్రీలో నాతో అనుచితంగా ప్రవర్తించినవారు కొందరున్నారు. కానీ, ఖాన్లందరూ చాలా మంచివారు. వారు నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. అయితే, వారి చిత్రాలను కూడా తిరస్కరించాను. ఎందుకంటే వారి సినిమాల్లో హీరోయిన్ రెండు సన్నివేశా లు, ఒక పాటకే పరిమితం.
ఆ స్టార్ల చిత్రాల్లో అలాంటి టెంప్లేట్స్ సాధారణం. అలాంటి పాత్రలను పోషిం చాలని నేను కోరుకోను. నా తర్వాత రాబోయే మహిళల కోసం నా వంతు కృషి చేయాలని చూస్తున్నా. ఏ ఖాన్లూ, ఏ కుమార్‌లూ, ఏ కపూర్ లూ మిమ్మల్ని విజయ తీరాలకు చేర్చలేరు. మీరు సొంతంగా కూడా విజయం సాధించగలరు. అందుకు నేనే నిదర్శనం” అని చెప్పింది. ఇటీవల మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ తనదైన మార్కు నటనను ప్రదర్శిస్తోంది కంగనా. తాజాగా కంగనా దర్శకత్వం వహిస్తూ నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. 1980ల ప్రారంభంలో దేశంలో ఏర్పడిన అత్యవసర పరిస్థితి ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కంగనా కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు ఇందిరాగాంధీగా కనిపించనుంది.