calender_icon.png 14 November, 2024 | 10:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయన అడవిని సృష్టించాడు!

10-11-2024 12:42:16 AM

  1. 200 హెక్టార్లలో అడవి పెంపు
  2. ఏడాదిలో రెండుసార్లు 9 పంటలు సాగు
  3. సాంప్రదాయ విత్తన బ్యాంకు ఏర్పాటు 
  4. కేంద్రం నుంచి పద్మశ్రీ అవార్డు  
  5. ఆయనే మిల్లెట్ మ్యాన్ ‘నెక్ రామ్ శర్మ’

సంగారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వాల మద్దతు లేకపోయి నా అయన ఓ అడవినే సృష్టించాడు. దాదాపు 200 హెక్టార్ల భూమిలో చెట్లను పెంచి రైతులకు ఉపాధి కల్పించి పర్యావరణాన్ని కాపాడుతున్నాడు. ఆయనే  హిమాచల్‌ప్రదేశ్ కర్సోగ్ జిల్లాలోని నౌంజ్ గ్రామానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత ‘నెక్ రామ్ శర్మ’.

సేంద్రియ వ్యవసాయాంలో ఆయన చేసిన కృషిని కేంద్ర గుర్తించి 2023లో పద్మశ్రీ అవార్డును అందించింది. సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహించిన అఖి ల భారత చిరుధాన్యాల చెల్లండ్ల సమాఖ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్ మ్యాన్, పర్యావరణ ప్రేమికుడు నెక్ రామ్‌శర్మపై ‘విజయక్రాంతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. 

1992లో సహజ వ్యవసాయం..

రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం ఇష్టం లేక 1992లో సహజ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 25 ఏళ్ల వయస్సులో అటవీ సంరక్షణ కోసం ఉద్యమం ప్రారంభించారు. స్థానిక రైతుల వద్ద ఉన్న విత్తనాలు సేకరించి, వాటిని విత్తడం ప్రారంభించారు. అటవీ, పర్యావరణ ఉద్యమం కోసం ఆయన చేసిన పోరాటం విజయవంతం కావడంతో తోటి రైతులు ఆయనను నమ్మి ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానాన్ని ఆయన రైతులకు వివరించారు. కీటకాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు దానిమ్మ తోటపై ఒక ప్రయోగం చేసి చూపించారు. దీంతో దానిమ్మ తోట కు ఉన్న రోగం పోయి పచ్చగా మారింది.

ఏడాదికి తొమ్మిది పంటలు సాగు!

నెక్ రామ్ శర్మ 1992లో రెండెకరాల్లో సహజ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. స్థానిక విత్తనాలను సేకరించి వాటిని విత్తడం ప్రారంభించగా, అందరు పిచ్చివాడు అని పిలిచేవారు. 2005లో సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలను అంతర పంట సాగు చేయడం ప్రారంభించారు. వానకాలంలో తొమ్మిది పంటలు సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో ఒక పంటకు నష్టం జరిగినా మరో పంట రైతులను ఆదుకుంటుంది.

హిమాచల్‌ప్రదే శ్‌లో రైతులు ఇప్పుడు తొమ్మిది పంటలు సాగు చేస్తున్నారు. నెక్ రామ్ శర్మ సంప్రదాయ పద్ధతిలో సాగుచేస్తున్న గోధు మలో అంతర పంటగా ఆవాలు, పప్పుధాన్యాలను సాగు చేస్తారు. మొక్కజొన్న, బీన్స్, రాజ్మా, ఉరద్, మూంగ్, రామదానా, ఫాక్స్‌వెల చిరుధాన్యాల పంటల ను కూడా పండిస్తారు. పొలం ఒడ్డున మామిడి, దానిమ్మ, లిచ్చి చెట్టను పెంచుతున్నారు. ఆవు పేడ, మూత్రంతో తయా రు చేసిన ఎరువులను ఉపయోగిస్తారు.

సంప్రదాయ విత్తన బ్యాంకు..

20 రకాల దేశీ విత్తనాలతో సాంప్రదాయ విత్తన బ్యాంకు భాండాగారాన్ని నెక్‌రామ్ శర్మ ఏర్పాటు చేశారు. వీటిలో 8 రకాల చిరుధాన్యాల విత్తనాలు, మూడు రకాల గోధుమలు ఉన్నాయి. వీటిని రైతులకు అప్పుగా ఇస్తూ ఉంటారు. పంట చేతికి వచ్చినప్పుడు రైతులు చేతినిండా గింజలకు బదులుగా అదే పరిమాణంలో తిరిగి చిరుధాన్యాలు ఇస్తారు. ఏటా రైతులకు సాంప్రదాయ విత్తనాలను పంపిణీ చేస్తారు. కొందరు మిత్రులకు ఉచితంగా కూడా ఇస్తారు. 

200 హెక్టార్లలో అటవి

హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో వైవిద్య పరిరక్షణలో నెక్ రామ్ శర్మ పరిశోధనలు చేశారు. 1992లో అక్షరాస్యత కోసం సామాజిక సేవను ప్రారంభించారు. నాంజ్ పంచాయతీలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. అడవుల సంరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలో 200 హెక్టార్లు అటవీ ప్రాంతాన్ని పెంచారు.

దీంతో అడవిలో పశువులకు మేతతోపాటు ఆకులు, రైతులకు గడ్డి దొరుకుతోంది. ఉసిరి, దాదు, మైరోబాలన్, నర్సరీలో పెంచి అడవిలో నాటించే కార్యక్రమాన్ని కర్సోగ్ ప్రాంతంలో ఉన్న పలు గ్రామాల్లో ప్రారంభించారు. వీటి సంరక్షణ కోసం మహాదేవ్, బాన్, బనౌనీ, కర్సోగ్ అనే ఐదు కమిటీలను ఏర్పాటు చేశారు.

మిల్లెట్ మ్యాన్‌గా గుర్తింపు

నెక్ రామ్ శర్మను హిమాచల్‌ప్రదేశ్‌లో మిల్లెట్ మ్యాన్‌గా పిలుస్తారు. 2023లో ప్రపంచ దేశాలు అంతర్జాయ మిల్లెట్ సంవత్సరంగా గుర్తిం చాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 2021లో భారత్‌దేశం ప్రతిపాదనతో ప్రకటించింది. నువ్వులు, కోడా, కాగ్రేని, చీనా, బజ్రా, సావ్నా, లిన్సీడ్, నువ్వులు, దేశీ మూంగ్, దేశీ మొక్కజొన్న విత్తనాలను గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తుంటారు.