calender_icon.png 26 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో అన్నయ్యాడు

24-03-2025 12:21:59 AM

  • ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచాడు 
  • సొంత ఖర్చుల తో టి స్థాల్ ఓపెన్ చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

సిరిసిల్ల, మార్చి 23(విజయక్రాంతి): అభిమానికి అండగా నిలిచాడు.. ఉపాధి కోల్పో యి రోడ్డున పడ్డ కుటుంబానికి సొంత ఖర్చులతో టి స్థాల్ పెట్టించి అన్నయ్యాడు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీ స్టాల్ పెట్టిం చి, ప్రారంభించాడు.

కొద్దీ రోజుల క్రితం  ట్రేడ్ లైసెన్స్ లేదంటూ, టీ స్టాల్‌పై కేటీఆర్  ఫోటో ఉండటంతో సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ ఘాట్ దగ్గర  శ్రీనివాస్  టీస్టాల్ ను కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు పూర్తిగా తొలగించిన విషయం తెలి సిందే.

సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు శ్రీనివాస్ కుటుంబం తో పాటుగా ధర్నా చేస్తూ ఆదుకోవాలి అంటూ కేటీఆర్ ను కోరడంతో ఫోన్‌లో  దైర్యం చెప్పారు. కేటీఆర్ సిరిసిల్ల చేరుకోని శ్రీనివాస్ కుటుంబాన్ని కలిసి త్వరలోనే తన సొంత ఖర్చుల తో టీ స్టాల్ ఏర్పాటు చేసి అందిస్తాని ఆ కుటుంబానికి మాట ఇచ్చారు.

మాట ఇచ్చినట్టుగానే కేటీఆర్  ఆదివారం  సిరిసిల్ల టౌన్ లో శ్రీనివాస్ కు కొత్త టీస్టాల్ స్వయంగా ప్రారంభించి ఆ కుటుంబలో సంతోషాన్ని నింపారు.ఇచ్చిన మాట ప్రకారం కొద్దిరోజుల్లోనే టీ స్టాల్ తిరిగి ఏర్పాటు చేయడం పట్ల శ్రీనివాస్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ కేటీఆర్  కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.