calender_icon.png 25 November, 2024 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి సింపుల్‌గా చేయమన్నాడు

23-11-2024 12:00:00 AM

హీరో నాగ చైతన్య, శోభితా దూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. తాజాగా పెళ్లి గురించి నాగార్జున ఆంగ్ల మీడియాకు ఆసక్తికర విషయాలు తెలిపారు. “నాగ చైతన్య, శోభితల పెళ్లి మీ నాన్నగారికి ఎంతో ఇష్టమైన అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదు. మా కుటుంబ వారసత్వంలో ఒక భాగం.

చైతన్య తన వివాహాన్ని సింపుల్‌గా చేయమని కోరాడు. దీంతో పెళ్లిని చాలా సింపుల్‌గా చేస్తున్నాం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు.. మొత్తంగా 300 మందిని పిలవాలనుకున్నాం. ఇక పెళ్లి పనులన్నీ నాగ చైతన్య, శోభితలే చూసుకుంటున్నారు. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్దంగా పెళ్లి జరగాలన్నారు. నాకు కూడా అలాగే ఇష్టం. పెళ్లి మంత్రాలు వింటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది” అని నాగార్జున తెలిపారు. పెళ్లి గురించి అయితే అన్ని వివరాలూ చెప్పారు కానీ రిసెప్షన్ గురించి మాత్రం వివరాలు ఇప్పుడే చెప్పలేనని నాగార్జున వెల్లడించారు.