calender_icon.png 1 October, 2024 | 2:53 PM

లంచం అడిగాడు.. ఏసీబీకి చిక్కాడు

01-10-2024 12:18:32 AM

రూ.6 వేలు తీసుకుంటూ పట్టుబడిన పశువైద్యాధికారి 

నల్లగొండ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో ఓ పశువైద్యా ధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. చింతపల్లి మండలం సనర్లపల్లి కి చెం దిన ఇద్దరు రైతులు బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకుని గేదెలు కొన్నారు. వీ టికి బీమా, ట్యాగ్‌లు వేయించేందుకు ఇటీవ ల చింతపల్లి పశువైద్యాధికారి జోసెఫ్ పాల్ ను కలిశారు. గేదెలకు ట్యాగులు వేసిన వై ద్యాధికారి ఆరోగ్య బీమా చేసేందుకు మా త్రం నిరాకరించాడు.

రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ.6 వేలు ఇస్తామ ని రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అ నంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించా రు. సోమవారం పశువైద్యాధికారికి అతడి కా ర్యాలయంలో రూ.6 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును సీజ్ చేసి విచారణ అనంతరం పశువైద్యాధికారిని రిమాండ్‌కు పంపినట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చంద్ర తెలిపారు.