అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ముద్దుగుమ్మల్లో కావ్య థాపర్ ఒకరు. మోడలింగ్ రంగంలో కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోందీ బ్యూటీ. ఇటీవల ‘డబుల్ ఇస్మార్ట్’, ‘విశ్వం’ సినిమాల్లో తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్ తొలిరోజులను గుర్తుచేసుకుటూ ఓ షాకింగ్ విషయాన్ని పంచుకుందీ చిన్నది. ఓ యాడ్ ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడాడని తెలిపింది కావ్య. ‘ఓ యాడ్‌లో ఆఫర్ ఉందని, ఆడిషన్స్ ఇవ్వడానికి ఆఫీసుకు రమ్మని ఓ వ్యక్తి చెప్పాడు. సరే అని అక్కడికి వెళ్లాను. ఆ తర్వాత అతను నాలుగు యాడ్స్‌లో అవకాశం ఇస్తా.. అందుకు నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే..
కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే కోపంతో అలాంటివి నాకు ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశాను’ అని తెలిపింది కావ్య థాపర్. తన ఇంకా చెప్తూ.. ‘నన్ను నటిగా చూడాలన్నది మా నాన్న కల. అందుకే సినిమాల్లోకి వచ్చాను. ముందు కొన్ని యాడ్స్‌లో నటించా.. తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది అని చెప్పుకొచ్చిందీ హాట్ బ్యూటీ.