calender_icon.png 22 September, 2024 | 5:04 AM

కాంగ్రెస్‌కు కూడా వచ్చేశాడు.. మరి బీజేపీకి ఎప్పడు?

22-09-2024 01:07:48 AM

 రాష్ట్రంలో పార్టీలకు అధ్యక్షులు కరువయ్యారు అనుకుంటున్న తరుణంలోనే ఇటీవలే పీసీసీ అధ్యక్షునిగా సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమించింది. అయితే బీజేపీకి మాత్రం ఇంతవ రకు అధ్యక్షున్నే నియమించలేదు. పార్టీ అధ్యక్షునిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన వెంట నే  పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనకు మోక్షం కల్పించాలని అధిష్ఠానానికి కోరా రు. అప్పటి నుంచి పార్టీ బాధ్యతల్లో పెద్ద గా ఇన్వాల్వ్ కావడం లేదు. ఆయన కశ్మీర్ ఇన్‌ఛార్జిగానూ పనిచేస్తున్నారు.

దీంతో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఆయ న పాల్గొనే అవకాశమే లేకుండా పోయిం ది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ఉం టే తప్ప ఆయన హైదరాబాద్ వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పార్టీ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు సాధించింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుండడంతో పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను ముందుకు తీసుకుపోయేందుకు కమలనాథులు ఎందుకు ఆస క్తి చూపించడం లేదో పార్టీ కేడర్‌కే అర్థం కావడం లేదు. పార్టీ అధ్యక్షుని నియామకంపై బీజేపీ అధిష్ఠానం అవలంబిస్తున్న నాన్చుడు వైఖరి వల్ల పార్టీకే నష్టం జరుగుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని పార్టీ నేతలు అధిష్ఠానం తీరుపై లోలోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.