న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో స్వల్పంగా 5 శాతం వృద్ధిచెంది రూ. 16,821 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 15,976 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2024 జూలై౬ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.78,406 కోట్ల నుంచి రూ.85,500 కోట్లకు పెరిగినట్లు శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.
క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 27,390 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ. 30,110 కోట్లకు పెరిగింది. అయితే బ్యాంక్ ఆస్తుల నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు 1.34 శాతం నుంచి 1.36 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.35 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి.