న్యూఢిల్లీ, జనవరి ౫: దేశం లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం క్ రుణవితరణ క్యూ3లో స్వల్పంగా పెరిగింది. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తమ అడ్వాన్సులు క్రితం ఏడాది క్యూ3తో పోలి స్తే 3 శాతం పెరిగి రూ.25.42 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ తాజా బిజినెస్ అప్‌డేట్‌లో తెలిపింది.
2023 డిసెంబర్ చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు రూ.24.69 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం డిపాజిట్లు క్యూ3లో 15.8 శాతం వృద్ధితో రూ.22.14 లక్షల కోట్ల నుంచి రూ.25.63 లక్షల కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ వెల్లడించింది.
ఇండియన్ బ్యాంక్ రుణ వృద్ధి 9.6 శాతం
ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ రుణ వృద్ధి ముగిసిన అక్టోబర్ త్రైమాసికంలో 9.6 శాతం పెరిగి రూ.5.59 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో బ్యాంక్ ఇచ్చిన మొత్తం రుణాలు రూ.5.10 లక్షల కోట్ల మేర ఉన్నాయి. క్యూ3లో డిపాజిట్లు 7.3 శాతం వృద్ధితో రూ.7.02 లక్షల కోట్లకు చేరినట్లు ఇండియన్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.