ఎన్నో ఏండ్లుగా ప్రైవేటు బ్యాంక్‌లకు లైసెన్సులివ్వడాన్ని నిలిపివేసిన ఇండియా 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత తిరిగి లైసెన్సులు జారీచేయడం ప్రా రంభించింది. ఆ సమయం నుంచి లైసెన్సులు పొందిన బ్యాంక్‌లు కొత్త టెక్నాలజీతో, అత్యాధునిక బ్యాంకింగ్ సేవలతో కార్యకలాపాలు ప్రారంభించినవి నవతరం బ్యాంక్‌లుగా ప్రసిద్ధి పొందాయి.
ఇప్పటి ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ (గతంలో యూటీఐ బ్యాంక్), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు అప్పుడు లైసెన్సు పొందినవే. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం క్‌ను దాని మాతృసంస్థ హౌ సింగ్ డెవలప్‌మెం ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) 1995 జనవరిలో ప్రారంభించింది. ముంబైలోని వర్లిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట కార్యాలయా న్ని, తొలి శాఖను అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.
ఆ ఏడాదే రూ.10 ము ఖవిలువనే షేరు ధరగా నిర్ణయించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఐపీవో జారీచేసింది. అటుతర్వాత 2001లో న్యూ యార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో ఏడీఎస్‌ను లిస్ట్ చేసి, ప్రపంచ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గ జం ప్రమోట్ చేసిన బ్యాంక్ అయినందున హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రైవేటు బ్యాంక్‌లు అన్నింటిలోకి శరవేగంగా వృద్ధిచెందింది. ఆధునిక బ్యాంకింగ్ సేవల్లోనూ, ఎన్‌పీఏల మేనేజ్‌మెంట్‌లోనూ, పాలనాపరమైన పారదర్శకతలోనూ, ప్రతీ ఏటా లాభాల్ని క్రమం గా పెంచుకోవడం ద్వారా దేశ, విదేశాల్లో వి స్త్రతమైన ఇన్వెస్టర్ల బేస్‌ను సాధించిన బ్యాం కింగ్ సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను చెప్పుకోవచ్చు.
మాతృసంస్థనే మించిపోయింది
ఆస్తుల రీత్యా దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌గా ఎదిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మా ర్కెట్ విలువలో ప్రపంచ టాప్ టెన్ బ్యాం క్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఆస్తుల్లోనూ, విలువలోనూ మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటె డ్‌నే మించిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాతృసంస్థ తన సబ్సిడరీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 2023లో విలీనమయ్యింది.
ఈ రెండింటి ఆస్తులు కలిపి మరింత పెద్ద సం స్థగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ పాంతరం చెందింది. దీనితో ప్ర పంచ విలువైన బ్యాంక్‌ల్లో ఏడో స్థానానికి ఎగబాకింది.
రూ.13.72 లక్షల కోట్ల విలువ
స్టాక్ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడయ్యే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.13,72,709 కోట్లు.
8,851 శాఖలు..రూ.36.17 లక్షల కోట్ల ఆస్తులు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 8,851 శాఖలు ఉన్నాయి. 20,938 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 2024 మార్చినాటికి 2,13,527 మంది ఉద్యోగులు ఉన్నారు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.36.17 లక్షల కోట్లు. ఆస్తుల రీత్యా దేశంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ద్వితీయస్థానంలో నిలిచింది.
విదేశీయులు పెట్టుబడులకు మక్కువ చూపించేది అయినందున, ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు 48.02 శాతం వాటా ఉన్నది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద వద్ద 31.35 శాతం, పబ్లిక్ వద్ద 16.67 శాతం చొప్పున వాటా ఉన్నది. ఈ బ్యాంక్‌కు ప్రస్తుతం శశిధర్ జగదీశన్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.