న్యూఢిల్లీ, అక్టోబర్ 15: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ (ఏఎంసీ) నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 శాతం వృద్ధిచెంది రూ. 576 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో రూ. 436 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ. 765 కోట్ల నుంచి రూ. 1,058 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ షేరు 1 శాతం మేర పెరిగి రూ. 4,530 గరిష్ఠస్థాయిని తాకింది.