శేరిలింగంపల్లి, నవంబర్ 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) మళ్లీ భగ్గుమంది. తమపట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఫైన్‌ల పేరుతో వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ సువశిశ రాణాపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. శనివారం హాస్టల్ గదులను పరిశీలించేందుకు వెళ్లిన వార్డెన్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. క్రమశిక్షణ పేరు తో తమకు వేలకు వేలు జరిమానాలు విధిస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపిస్తూ ఆయనపై మూకుమ్మడిగా విద్యార్థులు దాడి చేశారు.
దీంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీయగా.. సొమ్మసిల్లి పడిపో యాడు. సెక్యూరిటీ సిబ్బంది వార్డెన్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. తమ పట్ల వార్డెన్ రాణా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.