31-03-2025 06:20:19 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation Zonal Office) సోమవారం కీలక ప్రకటన చేసింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటనను హెచ్సీయూ రిజిస్ట్రార్(Hyderabad Central University Registrar) ఖండించారు. 2024 జులైలో హెచ్సీయూలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని, హద్దులు అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్సీయూ ఖండిస్తుందన్నారు.
ఇప్పటివరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, హెచ్సీయూ భూమి సరిహద్దుల(HCU Land Boundaries)పై సమాచారం ఇవ్వలేదని తెలిపింది. భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని, ఆ భూమిని హెచ్సీయూకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని హెచ్సీయూ రిజిస్ట్రార్ పేర్కొంది. ఆ భూముల్లో పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరతామని, వర్శిటీ భూములు కేటాయించబడిన భూమిని బదిలి చేయాలంటే విశ్వ విద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.