04-04-2025 05:06:52 PM
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగకృష్ణ
పెన్ పహాడ్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నాన్నివెనుకకు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో విలేకర్ల సమావేశం మాట్లాడారు. హెచ్ సీ యూ కు చెందిన భూములను అధికార దుర్వినియోగం, దౌర్జన్యం తో రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఈ దుశ్చర్యని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపడం హేయమైన చర్యన్నారు. . ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని సిఐటియు స్వాగతిస్తుందని.. ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.