calender_icon.png 4 April, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూములను కాపాడుకోవాలి

03-04-2025 12:00:00 AM

ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్ళు పడుతుంది

ప్రొఫెసర్ హరగోపాల్

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హెచ్‌సీయూలో అడవిని నాశనం చేయొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హెచ్ సీ యూ అడవి ఎంతో సుసంపన్నమైన ప్రకృతి అని, చూస్తే కానీ అర్థం కాదు అన్నారు. ఇందులో ఎన్నో రకాల అరుదైన పక్షి జాతులు ఉన్నాయన్నారు. ఒకసారి ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి వందల ఏళ్ళు పడుతుందన్నారు.

ఈ మేరకు బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో హెచ్‌సీ యూ కంచ గచ్చిబౌలి భూ సమస్యపై హరగోపాల్ మీడియాతో మాట్లాడుతూ హెచ్ సీయూ భూములు ప్రభుత్వానిదేనని కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ నైతికంగా ఆ భూమి హెచ్ సీయూదే నని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి అడవిని నాశనం చేయడం గురించి తీవ్ర ఆందోళన చెందుతున్న అనేక మంది పౌర సమాజ సంస్థలు, మేధావులతో కలసి మంగళవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశమై సమస్యలను వివరించామన్నారు.

పర్యావరణాన్ని కాపాడాలని, అడవిని నాశనం చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం దాని గురించి ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 360 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. దేశంలో 700 విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ హెచ్‌సీయూ మాత్రమే భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడిందన్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీకి 5 వేల ఎకరాలు, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి 8 వేల ఎకరాలు, ఉస్మానియా యూనివర్సిటీకి 2,600 ఎకరాలు ఉన్నాయన్నారు. 800 ఎకరాలు సరిపోదని ఇందిరాగాంధీ అనడంతో అప్ప టి రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సీయూకు 2,300 ఎకరాలు కేటాయించిందని అన్నా రు. ఇదే చివరి తరం కాదని, ప్రభుత్వానికి దూరదృష్టి, భవిష్యత్ తరాల పట్ల బాధ్యత ఉం డాలన్నారు.

హెచ్‌సీయూ భూముల వివాదా నికి 2003లో చంద్రబాబు నాంది పలికాడని అన్నారు. కానీ 2004 కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక ప్రైవేట్ వ్యక్తుల నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ భూమిని వెనక్కి తీసుకున్నారని అన్నారు. హెచ్ సీయూకు ఈ భూమితో పనిలేదు కానీ, అడవిని ధ్వంసం చేయకుండా ప్రభుత్వం ఫారెస్ట్ ఏరియాగా డెవలప్ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకూడదని అన్నారు.

ఇప్పటికే 100 ఎకరాలు భూమిని విధ్వంసం చేసారని, తక్షణమే ప్రభుత్వం 300 ఎకరాల భూమి కాపాడాలన్నారు. అప్పటి వీసీ ముం దు చూపుతో 2300 ఎకరాలకు ప్రహరీ గోడ నిర్మించారని వివరించారు. 2300 ఎకరాలకు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఈ ప్రకృతి విధ్వంసం జరిగి ఉండేది కాదన్నారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొ ట్టొద్దన్నారు.

విద్యార్థులు ప్రతిపక్షాల మాయ లో పడి నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నట్టు ప్రభు త్వం అనుకుంటుందని, కానీ అక్కడ ప్రకృతి విధ్వంసంపట్ల విద్యార్థులు నిరసన చేపడుతున్నారని తెలిపారు. ప్రభు త్వం విద్యార్థులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నరసింహారెడ్డి, విస్సా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.