calender_icon.png 16 March, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీయూ భూముల విక్రయం హేయమైన చర్య

16-03-2025 01:24:01 AM

  1. 400 ఎకరాల భూమిని కాపాడండి
  2. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 15(విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెం దిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం విక్రయించాలనుకోవడం హేయయైన చర్య అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె లక్ష్మణ్ విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

హెచ్‌సీయూ ఈస్ట్ క్యాంపస్‌లో ఉన్న 400 ఎకరాల భూమిలో ఎంతో ఆదరణ పొందిన మశ్రూం రాక్ సహా పక్షులు, నెమళ్లు, జింకలు, అరుదైన వృక్ష సంపదకు నిలయంగా ఉందన్నారు. హెచ్‌సీ యూ భూమిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ భూమి ని ప్రైవేటు, కార్పోరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాలకు ధారాదత్తం చేయాలనుకోవడం దారుణమన్నారు.

కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్‌కు కొమ్ము కా స్తుందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రె స్ ఇవాళ యూనివర్సిటి భూములను అదే కార్పోరేట్‌కు దోచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం దేనికిందకు వస్తుం దో ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి స్థలాన్ని హెచ్‌సీయూకు అప్పగించాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.