04-04-2025 01:21:23 AM
జనగామ, ఏప్రిల్ 3(విజయక్రాంతి): హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల 400 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయడం సరికాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని చెట్ల నరికివేతను ఆపాలని విశ్వహిందూ పరిషత్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అన్నారు.
ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వీహెచ్‌పీ ముఖ్య కార్యకర్తలతో కలిసి నిరసన ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యల వల్ల లక్షలాది వన్యప్రాణులు ఆవాసాన్ని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, పట్టణ ప్రతినిధులు డాక్టర్ అంబటి బాలరాజు, మాస రాజు, పక్కిరు రమేష్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.