calender_icon.png 23 December, 2024 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10.5 శాతం పెరిగిన హెచ్‌సీఎల్‌టెక్ లాభాలు

15-10-2024 01:59:42 AM

ముంబయి: హెచ్‌సీఎల్ టెక్2025 ఆర్థి క సంవత్సరంలో తన రెవిన్యూ వృద్ధి గైడెన్స్‌ను 3.5 శాతం నుంచి 5 శాతానికి పెంచిం ది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో రూ.4,235 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే లాభాలు 10.5 శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో సంస్థ  రెవిన్యూ గత ఏడాదితో పోలి స్తే 8.2 శాతం పెరిగి రూ. 28,862 కోట్లకు చేరుకుంది. అంచనాలకు మించి ఫలితాలు ఉండడం గమనార్హం.అన్ని మార్కెట్లు, సేవా విభాగాల్లో కంపెనీ మెరుగైన వృద్ధి సాధించడమే ఈ ఫలితాలకు కారణమని హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ శివ్ వాలియ తెలిపారు.