ముంబై: దేశంలో మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్‌డిసెంబర్)లో రూ.4,591 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే లాభాలు 5.5 శాతం, రాబడి 8.4 శాతం పెరిగింది.
ప్రతిపాదిత త్రైమాసికంలో కంపెనీ రాబడి రూ.29,890 కోట్లకు పెరిగింది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 2,134 మంది ఉద్యోగులను చేర్చుకుంది. కాగా కంపెనీ ప్రతి షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.