calender_icon.png 28 September, 2024 | 8:50 AM

హైటెక్స్‌లో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్!

28-09-2024 02:27:03 AM

  1. ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌కు ఆహ్వానం
  2. క్యాంపస్ ఏర్పాటుతో 5 వేల మందికి ఉపాధి 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీ ఎల్ తమ నూతన క్యాంపస్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సచివాలయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నినాడార్ మల్హోత్రా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభు త్వం విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా తీసుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి, హాల్ చైర్‌పర్సన్ రోష్నినాడార్‌కు వివరించారు. విద్యార్థులకు మెరు గైన శిక్షణతోపాటు విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో హెచ్‌సీఎల్ భాగస్వామ్యం కావాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధి విషయంలో హెచ్‌సీఎల్‌తో కలిసి పనిచేయడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పిం చి, వారికి సాధికారతను కల్పించేందుకు చేపట్టే కార్యక్రమా ల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని రోష్నినాడార్ పేర్కొన్నారు.

స్కిల్ యూనివర్సిటీతోపాటు హెచ్‌సీఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలోని ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరిం చేందుకు ప్రణా ళికలు, దీనితో ఎక్కువ మంది లబ్ధి పొందుతారనే ఆలోచనలనుకూడా పంచుకున్నారు. మీటింగ్‌లో సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.