08-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 7: ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కాకముందే టికెట్ల ‘బ్లాక్’ దందా షురూ అయింది. గత సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్లను అమ్మకానికి ముందే బ్లాక్ చేసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) విమర్శలపాలైంది. సీజన్ మారినప్పటికీ హెచ్‌సీఏ అదే వైఖరిని ప్రదర్శిస్తుండడం క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఈ నెల 23న, 27న ఉప్పల్ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన నిమిషాల వ్యవధిలోనే ‘సోల్డ్ అవుట్’ అనిదర్శనమిచ్చింది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనున్న సన్‌రైజర్స్ ఆ తర్వాత మార్చి 27న లక్నోతో తలపడనుంది.
ఈ రెండు మ్యాచ్‌ల టికెట్లకు సంబంధించిన అమ్మకాలను ఆన్‌లైన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉం చనున్నట్లు హెచ్‌సీఏ పేర్కొంది. కాగా క్రికెట్ అభిమానులు శుక్రవారం పేటీఎంలోని డిస్ట్రిక్ యాప్‌లో ఐపీఎల్ టికెట్లు కొనడానికి వెబ్‌సైట్ ఓపెన్ చేశారు.
అయితే టికెట్ల అమ్మకాలు షురూ అయి న కాసేపటికే వెబ్‌సైట్లో సోల్డ్ అవుట్ కనిపించింది. రూ. 700 టికెట్లు మొత్తం బ్లాక్ లేదా సోల్డ్ అవుట్ అని చూపించింది. కేవలం 10వేలు, 21 వేల రూ పాయల టికెట్లు మాత్రమే బుకింగ్ అం దుబాటులో ఉన్నట్లు యాప్‌లో చూపించడం గమనార్హం. దీంతో హెచ్‌సీఏ, ఫ్రాంచైజీ తీరును తప్పుబట్టారు.